ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా? ఇన్నాళ్ళు పెండింగ్‌లో ఉన్నా… ఇప్పుడు సభ సాక్షిగా కోరినందున ఇక ఛైర్మన్‌కు కూడా తప్పదా? నిజంగానే ఆమోద ముద్ర పడితే… అది ఎవరికి లాభం? ఎవరికి లైన్ క్లియర్ అవుతుంది. ఆ నేత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద పోటీ చేయగలరా? లెట్స్ వాచ్. శాసనమండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత… అందుకు కారణాలను ఇవాళ సభలోనే వివరించారు. తెలంగాణ జాగృతి…
ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని చెప్పారు. ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీగా మారుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా శాసనసభ నుంచి వెళ్తున్నానని, రాజకీయ శక్తిగా తిరిగివస్తానని చెప్పుకొచ్చారు. తనను ఆశీర్వదించండని, తనతో పాటు నడవండని కవిత కోరారు. ‘కౌన్సిల్లో ఇవాళ మరొకసారి నా రాజీనామాను…
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. ‘ఇసుక…
శాసనమండలిలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు కక్షగట్టారని చెప్పారు. బీఆర్ఎస్‌లో మొదటి నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని శాసనమండలిలో ఎమ్మెల్సీ…
ఐడీపీఎల్ భూముల ఆక్రమణదారులు ఎవరు? ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణల్లో ఏది నిజం? తేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూముల్ని ఆబగా ఆక్రమించుకుందామనుకున్నది ఎవరు? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? దొంగ ఎవరో, దొర ఎవరో తేలిపోతుందా? Also Read:Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే.. మూతపడ్డ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో పొగలు పుట్టిస్తోంది. హైదరాబాద్…
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి…
తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది. పండగ కోసం పాటలు సిద్ధం చేసి విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు ఔత్సాహికులు. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా... వేటి స్టైల్‌లో అవి సాంగ్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఈసారి మాత్రం బీఆర్‌ఎస్ బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఏళ్ళ తరబడి గులాబీ పార్టీ..
ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పదేళ్ళపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒక ఎత్తయితే....ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం మరింత కుంగదీసింది. ఇక పార్టీని రీ ఛార్జ్ చేయాలి, గ్రామస్థాయి నుంచి మళ్ళీ పటిష్టం చేయడం కోసం జనంలోకి దూకుడుగా వెళ్ళాలనుకుంటున్న టైంలో... కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మూడు నెలల క్రితమే తేడా వచ్చినా...…
‘నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి’ అని బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని, మీకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం వస్తుందని.. ఇందులో భాగంగానే మొదటగా తనను బయటకు పంపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు.. మన ముగ్గురం (కేసీఆర్,…
Kalvakuntla Kavitha on Future Plans: తన తండ్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను శిరసావహిస్తా? అని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ వివరణ కోరలేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా…