తెలంగాణ రాజకీయాల్లో నిత్యం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉప్పు-నిప్పులా ఉంటాయి. ఇక ఈ పార్టీల నేతలు ప్రతిరోజు ఒకరిపై మరోకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటుంటారు. అయితే నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. ఓ ఫక్షన్‌లో బండిసంజయ్, ఎమ్మెల్సీ కవిత ఇరువురు ఒకరినొకరు పలకరించుకున్నారు. నిత్యం విమర్శించుకునే నేతలు ఇప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also: Vehicles Registration in TS: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
నేతల విమర్శలు రాజకీయపరమైనవేననీ.. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు ఉండే అవకాశం లేదని పలువురు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గణేష్‌తో పాటు బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్సీ కవిత- బండి సంజయ్‌కి పరిచయం చేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య గృహప్రవేశ కార్యక్రమంలో ఈ సీన్ కనిపించింది. ఈ కార్యక్రమంలో ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో ఒకరినొకరు పలకరించుకున్నారు.
Read Also: Prabhas: ‘సలార్’.. ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్
అయితే అంతకు ముందు.. దేశంలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు తెలుపుతున్న కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో ఈ పోస్టు చేశారు. మహిళా రెజ్లర్ల కృషి, అంకితభావం, దేశభక్తి భారతదేశం రెజ్లింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిందని కవిత అన్నారు. పోక్సో వంటి తీవ్రమైన అభియోగం తర్వాత కూడా నిందితుడు బహిరంగంగా బయట ఉన్నాడుని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.