Dharmapuri Arvind: కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ ఖండువా కప్పి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఆహ్వానించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. పారిపోయి మెదక్ వెళ్లొద్దంటూ ఎద్దేవ చేశారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అక్కడ తిరగడం ఆమె బాధ్యత అన్నారు. ఆమె తండ్రి కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని తెలిపారు. నేను తండ్రి మాట విననట్లే కవిత కూడా కేసీఆర్ మాట వినకుండా నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి విఫలమైన మందు అంటూ ఎద్దేవ చేశారు. ప్యాకేజి కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అరవింద్. ఎన్నికల్లో కోట్లాడుతారు.. ఎన్నికలు ముగియగానే దోస్తీ కడుతారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలిచినోళ్లు బీఆర్ఎస్ లో చేరడం కొత్తేమి కాదంటూ వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణ ఫలితం బీజేపీకి అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పుకు ఓటు వేస్తారని అన్నారు. కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Top Headlines@1 PM : టాప్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణాలో గడిచిన 9 ఏళ్లలో కుటుంబ పాలనా, వంచన పాలనా, అవినీతి పాలనే నడిచిందని అన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగెత్తి ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని, లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అవినీతిపాలనాను మోడీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని, స్వచ్ఛమైన తెలంగాణబిడ్డ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీ లో చేరారని తెలిపారు. రాకేష్ రెడ్డి ని స్వాగతం పలుకుతున్నామన్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తరుణ్ చుగ్ తెలిపారు.
Lavanya Tripati -Varun Tej : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్?