MLC Kavitha: ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జరిగిన నీటి పారుదల దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం గర్వపడాలన్నారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఎదగాలో.. ఎక్కడ పడాలో తెలిసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కేసీఆర్ అంటే కాల్వలు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు అని ఆయన అన్నారు. తక్కువ కాలంలో రాష్ట్ర భవితవ్యాన్ని మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు అని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓ వ్యక్తి కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో ఆలోచించుకోవాలి ప్రజలకు సూచించారు.
Read also: Telangana Rains: కేరళకు ప్రవేశించనున్న రుతుపవనాలు.. మూడు రోజులు వర్షాలు
కాల్వలు తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా సాగునీటి రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. పారదర్శక పాలన ఉన్నందున 21 రోజులపాటు ఒక్కో శాఖలో సాధించిన ప్రగతిని వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి కష్టాలు కేసీఆర్ ఎంత కష్టానికి గురయ్యాయో చిన్నప్పుడు తనకు తెలుసని వెల్లడించారు. కాళేశ్వరం వల్ల నిజామాబాద్ జిల్లాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. వేసవిలోనూ చెరువులు నిండడం వెనుక కేసీఆర్ కృషి దాగి ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే భగీరథ ప్రయత్నమేనన్నారు. జిల్లాలో కాళేశ్వరం ద్వారా లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంజినీర్ల సంఖ్యను పెంచామని, నీటిపారుదల, ఇంజినీరింగ్ శాఖలను బలోపేతం చేశామన్నారు. అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయని, నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.
Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం