MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha Says Other States Copying Telangana Schemes: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగనీటి దినోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రేస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరైంది కాదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే.. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సొంతూరులో పింఛన్ ఇవ్వడానికి ఆలోచించేవారని దుయ్యబట్టారు. వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉండటం వల్లే.. సంక్షేమ పథకాలు అమలు, ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం లొల్లి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Minister Kottu Satyanarayana: పవన్‌పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
నిజామాబాద్ ప్రజలు కేవలం కేసీఆర్ కటౌట్ చూసి ఓటు వేశారని, ఆయన ఖ్యాతి ఎవరెస్ట్ అంటూ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని సమీక్ష చేయడం కోసమే.. ఈ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పే సత్తా కేసీఆర్‌కి మాత్రమే ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో కరువు ఉండేదని.. కానీ ఇప్పుడు ఎక్కడా చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యామ్‌లు, రిజర్వాయర్లు అని అభివర్ణించిన ఆమె.. అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర రావు అని పిలవాలి కోరారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కాలువలు కట్టకుండానే వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత.. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
Swimming Pool Death: యువకుడ్ని మింగేసిన స్విమ్మింగ్‌పూల్.. కారణమదే!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు