ప్రతిరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలలో బిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత ఈరోజు కాసేపు రోడ్డు పక్క సామాన్య మహిళతో ముచ్చటించారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాసేపు సేదదీరారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత రుచిని ఆస్వాదిస్తూ ఆమె వివరాలు సేకరించారు.
Also Read : Tiger Hunt Duck: పులి నుంచి తప్పించుకున్న బాతు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..
తన పేరు నర్సమ్మ అని పేర్కొంటూ నాటికి నేటి కేసీఆర్ సారు పాలనకు తేడాను వివరించింది కొమురమ్మ.. తనకే కాదు ఇంటింటికి పింఛన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని పేర్కొంది.. స్వయంగా కేసీఆర్ బాపు కూతురే తన వద్ద మొక్కజొన్న తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఎమ్మెల్సీ కవితను చూసిన స్దానిక వాహనదారులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ అభిమానాన్ని చాటుకోగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత.
Also Read : CM KCR : భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు