జీనోమ్ వ్యాలీలో రూ. 2వేల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని.. మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా తయారు చేయబోతున్నట్లు తెలిపారు. MSME పాలసీని మరింత పటిష్టంగా తెచ్చామని.. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వల్ల ఉపాధి ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఆ దేశపు రాయబారి రువెన్ అజర్‌కు ఆయన ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు.
IT Minister Sridhar Babu: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలకు దిగలేదని, బీఆర్‌ఎస్ వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వారమని, పరిశ్రమలు ప్రగతికి ముఖ్యమన్నా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే... అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేయవద్దని, మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు.
జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మర్డర్ ఎవరు చేసినా.. ఎవరు చేయించినా వదిలేది లేదని స్పష్టం చేశారు.
Minister Sridhar Babu: రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయలేదు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వచ్చాయి.. త్వరలో మిగిలిపోయిన రైతుల ఖాతాల్లో రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు.
D. Sridhar Babu: ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు.
శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతున్న తమను పట్టించుకునే నాధుడే లేడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు బాలికలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్ని…