D. Sridhar Babu: ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. ఆ ఇద్దరూ బీఆర్ెస్ ఎమ్మెల్యేలే.. వారి అంతర్గత విభేధాలతో కొట్టుకున్నారని క్లారిటీ ఇచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. పనులు మొదలు పెడుతామన్నారు. పత్తపాక రిజర్వాయర్ కి ఈ బడ్జెట్ లో డబ్బులు కెటాయించామన్నారు. అర్థికమంత్రిగా భట్టి ఈ రాష్ట్రం ని బడ్జెట్ పరంగా గాడిలో పెడుతున్నారని అన్నారు.
Read also: Thatikonda Rajaiah: అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్ కు చేసింది గుండు సున్నా..
సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే తప్పా అందరికీ రుణమాఫి అయ్యిందన్నారు. అంతకు ముందు పెద్దపల్లి జిల్లా మంథనిలో సెంటిలియన్ సాఫ్ట్ వేర్ కంపనీని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మంథని ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉంటుందన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా సంకల్పం అన్నారు. మా మంథని ప్రాంత మేధస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మంథని లో త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
Ponnam Prabhakar: ఆంధ్రోళ్ల పై కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతా..