Minister Sridhar Babu: రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయలేదు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వచ్చాయి.. త్వరలో మిగిలిపోయిన రైతుల ఖాతాల్లో రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలి.. ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేశారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
Read Also: Supreme Court: ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు
అలాగే, భావితరాలకు దశ దిశ నిర్దేశించి జీవితం అంకితం చేసిన నాయకులు జువ్వాడి రత్నాకర్ రావు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మా నాన్న గారు చనిపోయినప్పుడు నన్ను రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చారు.. శాసనసభ్యునిగా, జిల్లా అధ్యక్షులుగా నేను ఉన్నప్పుడు నా వెనుక ఉండి నడిపించింది రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. పేదలకు లబ్ధి చేయాలని అండగా ఉండాలని తాపత్రయపడే నాయకులు రత్నాకర్ రావు.. దేవాదాయ శాఖ మంత్రిగా దీప దీప నైవేద్య కార్యక్రమం చేపట్టి దేవాలయాలలో దీపం వెలిగించి ఆదర్శంగా నిలిచారు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కీలక నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావు.. రైతులకు ఉపయోగపడే విధంగా రాజశేఖర్ రెడ్డి వెంటపడి కోరుట్లలో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేసిన మహనీయుడు.. దీంతో ఇక్కడ ఎందరో యువకులకు ఉద్యోగ అవకాశం కలిగింది అని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.