దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వివరాలను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు.
Data Center : పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ యొక్క డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్‌ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిపాదిత డేటా సెంటర్ ₹4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్…
‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్గా గుర్తించి.. అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.
నా 35 సంవత్సరాల విద్యార్థి, రాజకీయ జీవితంలో వివిధ దశల్లో కలిసి పనిచేసిన వారు ఈ వేదిక మీద ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన "ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర" అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "విద్యాసాగర్ రావును అందరూ సాగర్ జీ గానే గుర్తిస్తారు. మాకు కూడా ఆయన సాగర్ జీ నే.
తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు అయిదుగురు ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేశారని.. కానీ మా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత అని విద్యాసాగర్‌రావు అన్నారు. తాను రచించిన "ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర" అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "సాంస్కృతిక జాతీయ వాదం అందరిలో ఉంది..
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఘటన అందరినీ ఆకట్టుకుంది. భాగ్యనగరంలో బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన "ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర" అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు.
మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక బాధ్యత వరించింది. ‘తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే అల్లు అర్జున్ స్పందించారని అన్నారు.
Sridhar Babu: మీ సేవ మొబైల్ యాప్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేశారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను ప్రభుత్వం యాడ్ చేసినట్లు తెలిపారు.