కొత్త కలర్, స్పోర్టీ స్టైల్, భారీ తగ్గింపు ధరతో 2026 Aprilia RS 457, Tuono 457 బైక్స్ లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 Aprilia RS 457, Tuono 457: ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రీలియా ఇండియా (Aprilia India) దేశీయ మార్కెట్లో 2026 మోడల్ ఇయర్ (MY) RS 457 అండ్ Tuono 457 బైక్ లను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ రెండు మోడళ్ల ధరలను కంపెనీ తగ్గించడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
కొత్త డిజైన్‌తో మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ గా రాబోతున్న 2026 KTM 790 Duke..
Also Read
- Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
2026 Aprilia RS 457 GP రెప్లికా కలర్ గత ఏడాది EICMA షోలో ప్రపంచానికి పరిచయం అయింది. ఈ వేరియంట్ ధర రూ. 4.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే సుమారు రూ. 15,000 ఎక్కువ. RS-GP రేస్ బైక్ డిజైన్‌ను అగుపించేలా స్పోర్టీ గ్రాఫిక్స్ ఇందులో ఉన్నాయి. ఈ వేరియంట్‌లో అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లీవర్స్ మరియు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇతర కలర్ ఆప్షన్‌లలో క్విక్‌షిఫ్టర్ కావాలంటే అదనంగా రూ. 25,000 చెల్లించాలి.
GST 2.0 కారణంగా RS 457 ధర ఒక సమయంలో రూ. 4.51 లక్షల వరకు పెరిగింది. ఇప్పుడు 2026 మోడల్‌లో కోరల్ బ్లూ స్నేక్, ఆర్సెనిక్ యెల్లో కొత్త పెయింట్ స్కీమ్స్ తో ధరను రూ. 4.22 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గించారు. అంటే దాదాపు రూ. 29,000 తగ్గింపు వచ్చింది. మరోవైపు 2026 Aprilia Tuono 457 ధర ప్రస్తుతం రూ. 3.97 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ నేకడ్ స్ట్రీట్‌ఫైటర్ ధరను సుమారు రూ. 27,000 తగ్గించారు. ఇది RS 457తో ఒకే 457cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంది. అలాగే చాసిస్, స్వింగ్ ఆర్మ్ వంటి మెకానికల్ భాగాలు కూడా ఒకేలా ఉంటాయి. GST 2.0 నియమాల ప్రకారం 350cc పైబడిన బైక్‌లపై 40% పన్ను విధించడంతో Tuono ధర ఒక దశలో రూ. 4.24 లక్షలకు పెరిగింది.
Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!
Aprilia RS 457లో ఉన్న ఇంజిన్ సుమారు 47.6 PS పవర్, 43.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది. బైక్‌లో ట్విన్-బీమ్ అల్యూమినియం ఫ్రేమ్, 41mm USD ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్, డ్యూయల్-చానల్ ABS, ByBre కాలిపర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా రైడ్-బై-వైర్ థ్రాటిల్, మూడు రైడింగ్ మోడ్‌లు, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, ఫుల్ LED లైటింగ్, 5-ఇంచ్ TFT డిస్‌ప్లే అందుబాటులో ఉన్నాయి.
ఈ బైక్ 175 కిలోల కర్బ్ వెయిట్, 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 800mm సీట్ హైట్ కలిగి ఉంది. టువునో 457 మాత్రం మినిమలిస్ట్ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్, స్లీక్ LED లైటింగ్, ఎక్స్‌పోజ్డ్ బాడీవర్క్‌తో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త ధరలతో ఈ రెండు మోడళ్లు మిడ్-కెపాసిటీ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
-
Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?