కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం... చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను చర్చించారు.
తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని..చేరికల విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు.
తన ప్రమేయం లేకుండా జరగాల్సినది జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ మారే ఆలోచన ఇప్పటివరకు ఐతే లేదని..బీజేపీ నుంచి ఎవరు తనను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
D. Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రాత్రి ఓ వాణిజ్యసముదాయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సరదాగా కాసేపు ముచ్చటించారు.
నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంచుకునేందుకు ఏటా లక్ష రూపాయలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? హామీలు ఎగ్గొట్టిన బీజేపీ కావాలా? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
మూడు గంటలపాటు రైతులు చెప్పిన మాటలు విన్నామని, మాటలు తక్కువ చెబుతాం, పని ఎక్కువ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెనిఫెస్టో లో ముత్యంపేట షుగర్ ప్రాజెక్టు తెరిపింఛాలని అన్న అంశం పెట్టించారని, ముందు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలన్నాడని, ఖజనాలో రూపాయి లేకున్నా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. భోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని…
తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం పై చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొ్న్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్…
హరీశ్ రావు బీఏసీ సమావేశానికి రావడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్ దృష్టికి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. లెటర్ కేసీఆర్ నుంచి రావాలి కదా.. లెటర్ ఇవ్వకుండా అనుమతి ఇచ్చేది లేదు..ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.