Minister Sridhar Babu: తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలన చేయడానికి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ (Future City) లోని సమ్మిట్ వేదికను సందర్శించారు. వేదిక ప్రాంగణంలోనే మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియదు.. నేను అడిగిన వాటికి సీఎం క్లారిటీ ఇవ్వాలి అని అన్నారు. గంగులు వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ఆకారాలు పెద్దగ ఉంటే..అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అవగాహన లేదు అంటున్నారు.. ఆయన కంటే…
Ramantapur Incident Ex-Gratia: హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల కారణంగా జరిగిన ఘోర విషాద ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నారు. మరోవైపు పరిస్థితి విషమంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు…
గోదావరి జలాలను ఒక్క బొట్టు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రభుత్వంతో చర్చిస్తాం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడమన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ని అసలు ఒప్పుకునేదే లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి.. నీళ్లు ఎక్కడికి తీసుకుపోయారో చూసాము.. పక్కనే ఉన్న గోదావరి నీళ్లను ఇక్కడి ప్రజలకి అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఇక, సౌర శక్తి ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మహిళా సంఘాలకు ఇవ్వడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో తీసుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం ఎందుకు ఇస్తున్నారు అని విమర్శిస్తున్నారు.
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో…
మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా… ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగేయదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలి. డీపీఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేసింది. కానీ.. చేసిందేం లేదు. చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించడం సరి కాదు. ప్రతి…
Minister Sridhar Babu: మినిస్టర్ క్వార్టర్స్‌లో "NXP సెమీ కండక్టర్స్" ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమైయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు.
Duddilla Sridhar Babu : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి , రాహుల్ గాంధీ కులం , మతం గురించి ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం, వారు రాహుల్ గాంధీ తల్లి ఒక క్రిస్టియన్, తండ్రీ ఒక ముస్లిం అయినందున ఆయన కులం ఏది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బీజేపీ…