Sridhar Babu: కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేయవద్దు.. రైతులను ఆదుకోండి
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
- పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
- రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి-మంత్రి
- కేంద్రం ఇతర దేశాల నుంచి పత్తిన దిగుమతి చేయవద్దు- శ్రీధర్ బాబు
- మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయి- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేయవద్దని, మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి.. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పలు ప్రారంభోత్సవాలు చేశారు. మల్హర్ మండలంలోని కొండంపేట గ్రామంలో పీఏసీఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రం, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం, కాటారం మండలం కేంద్రంలో మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
Read Also: Chennai: ముంబై బాలికపై ఆటోడ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు అత్యాచారం.. నిందితుల్లో ఏపీ వాసి
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దొడ్డు రకం, సన్న రకం తేడాను స్పష్టంగా తెలియజేసేలా కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాలో ఉన్న మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తామని.. అండర్ టేకింగ్ ఆఫిడవిట్ తీసుకొని ధాన్యం కేటాయింపులు చేయాలని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు తాలు పేరుతో రైతులకు కోతలు పెట్టవద్దని సూచించారు. సన్న రకం ధాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అర్హులైన ప్రతి రైతుకు అందాలని అన్నారు. జిల్లా సరిహద్దులో పటిష్ట పర్యవేక్షణ చేయాలని.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం మన జిల్లాకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు.
Read Also: Minister Anitha: సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్
సన్న రకం ధాన్యం క్రింద ఏ రకం ధాన్యాన్ని పరిగణిస్తున్నామనే అంశంపై రైతులకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!