Sridhar Babu: మీ సేవ మొబైల్ యాప్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేశారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను ప్రభుత్వం యాడ్ చేసినట్లు తెలిపారు. గ్యాప్ సర్టిఫికెట్.. సిటిజన్ నేమ్ చేంజ్ వంటి తొమ్మిది రకాల అంశాలను కొత్తగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇన్ని రోజులు ఫిజికల్ గా వెళ్లి తీసుకునే అంశాలను ఇక నుంచి మీ సేవ నుంచే పొందే అవకాశం కల్పించామన్నారు. మీ సేవలో కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అన్ని విభాగాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధిని ముందుకు సాగించాలని పని చేస్తున్నామని తెలిపారు.
Read also: Ponnam Prabhakar: ఏడాది పాలనపై హరీష్ రావు చార్జీషీట్.. పొన్నం ప్రభాకర్ కౌంటర్..
జవాబు దారి తనంతో మేమేం చేశామో చెప్పామని మంత్రి తెలిపారు. ఏడాదిగా మేమేం చేశాం.. వచ్చే నాలుగేళ్ళు ఏం చేయబోతున్నామో విజయోత్సవాల ద్వారా చెప్తున్నామన్నారు. ADeX HDFC బ్యాంకు ద్వారా రైతు రుణాలను రెండు రోజుల్లోనే పొందేలా యాప్ తీసుకువచ్చామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా మిత్రా యాప్ రూపొందించామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మీ సేవల్లోకి కొత్త అంశాలను తీసుకొచ్చామని మంత్రి అన్నారు. ఆఫీస్ ల చుట్టూ తిరిగే అవకాశాలు లేకుండా కొత్తగా తొమ్మిది సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. టీ-ఫైబర్ కనెక్టివిటీ ప్రతి ఇంటికి అందుబాటులోకి వస్తుందన్నారు.
Read also: Pushpa -2 : హిందీ మూడు రోజుల కలెక్షన్స్.. ఊచకోత.!
ఒక కంప్యూటర్ కి సంబంధించిన అన్ని అంశాలను టీ-ఫైబర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. టీ-ఫైబర్ కోసం కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని, క్లియర్ అయ్యేలా చేస్తామన్నారు మంత్రి. అభివృద్ధి కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాదని ముఖ్యమంత్రి అన్నారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాన్ని కూడా బయటకు తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఉపాధి పెంచే ప్రతి పరిశ్రమ మాకు ముఖ్యమని మంత్రి తెలిపారు. చిన్న, మధ్య తరగతి సంస్థలను ఎంకరేజ్ చేయాలని పదేళ్ల తరువాత కొత్త MSME పాలసీ తీసుకువచ్చామన్నారు.
చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు గత పదేళ్లుగా దాదాపుగా 4 వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదని అన్నారు. దశల వారిగా MSME ఇన్సెంటివ్స్ ఇస్తామని శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 MSME ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రోగ్రెసివ్ ఐడియాస్ ను ప్రభుత్వంతో పంచుకోవాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రగతిని ఆపాలని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. వచ్చే నాలుగేళ్ళలో ఇండస్ట్రీస్ లోను నంబర్ వన్ గా నిలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Sukumar : దట్ ఈజ్ సుకుమార్.. ఆయన గొప్పతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది !