Free Gas Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధం అయ్యింది.. మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నవంబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ప్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు. కానీ, ఈ పథకంపై ఇంకా కొందరిలో అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు..
Read Also: New York City: ఫలించిన హిందూ సంఘాల ఉద్యమం.. అమెరికాలో దీపావళి రోజున పాఠశాలలు బంద్..
మహిళల కోసం ఉచితంగా మూడు సిలిండర్ల పథకం తీసుకొచ్చాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అయితే, ఈ పథకంలో ఎవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదన్నారు.. గ్యాస్ కనెక్షన్, రైస్ కార్డు (రేషన్ కార్డు)లకు ఆధార్ కార్డు నంబర్ అనుసంధానం చేసుకుని ఉంటే చాలు.. వారు అర్హులే అని స్పస్టం చేశారు.. 894 కోట్ల రూపాయల చెక్కును ఆయిల్ కంపెనీలకు ఇచ్చాం.. ఎక్కడా ఎలాంటి లోపం ఉండకూడదనే అడ్వాన్స్ చెక్ ఇచ్చామని వెల్లడించారు.. ఇక, కేంద్రం ఇచ్చే ఉజ్వల పథకం 9.6 లక్షల మందికే ఇస్తున్నారు.. డీబీటీ విధానంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కూటమి ప్రభుత్వంగా మా మొదటి పథకంగా అందిస్తున్నాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Offers on Liquor: మందు బాబులకు లిక్కర్ షాపుల బంపరాఫర్..
కాగా, ఆయిల్ కంపెనీలకు రూ. 876 కోట్ల చెక్కును ఈ రోజు సచివాలయంలో అందజేశారు సీఎం చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభం కానుంది.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇందుకూరు గ్రామంలో సిలిండర్ల పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రేపు దీపావళి పండుగ రోజు నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేయనున్నారు. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఏపీ సర్కార్ ఇవ్వనుంది. దీంతో.. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి గ్యాస్ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డును ప్రాతిపదికగా నిర్ణయించారు. పథకంలో భాగంగా వినియోగదారులు తొలుత సిలిండర్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజులలోపే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమచేస్తారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు..