Minister Nadendla Manohar: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నామన్నారు. అక్టోబర్ 31న డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు. 894.92 రూపాయలు డీబీటీఏ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి బ్లాక్ పీరియడ్ విధానం అమలు చేస్తామన్నారు. ఆగష్టు వరకూ ఒక సిలిండర్, నవంబర్ వరకూ ఒక సిలిండర్, జనవరి వరకూ ఒక సిలిండర్ అందిస్తామన్నారు. డెలివరీ అయిన 48 గంటల లోపే లబ్ధిదారుల అకౌంట్‌కే డబ్బులు వచ్చేస్తాయన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక ఆఫీసు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Read Also: APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకం
దీపావళి పండుగ ఒకరోజు ముందే వచ్చిందా అన్నట్టు ఈ మూడు సిలిండర్ల పథకం అమలు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాపాల వల్ల సిలిండర్ల ధరలు పెరిగిపోయి మహిళలు బాధపడ్డారని విమర్శించారు. మహిళల బాధలు ఎన్నికల ముందు పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుసుకున్నారన్నారు. మహిళల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం చెపుతారన్నారు. నాలుగు నెలల కాలంలో ఏ సమయంలో అయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చన్నారు.