Minister Nadendla Manohar: రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు. రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. 73373-59375 నెంబర్‌తో ఇక సేవలు ఉండనున్నాయని తెలిపారు. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తామన్నారు. రైతులు నెంబర్‌కు Hi అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందన్నారు.
Read Also: Actress Kasturi: జైలుకు తమిళ నటి కస్తూరి.. ఈ నెల 29 వరకు రిమాండ్
రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత… రైతు పేరును ధృవీకరించాలని చెప్పారు. అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలన్నారు. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లుంటాయన్నారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలన్నారు. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలన్నారు. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుందన్నారు. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది నమోదు చేయాలన్నారు. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుందన్నారు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్‌తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషమని పేర్కొన్నారు.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదు. 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు… సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుంది. సులభంగా… pic.twitter.com/TPXmSVDCSp
— Manohar Nadendla (@mnadendla) November 17, 2024