చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్‌ను ఏపీ కాంగ్రెస్ చీఫ్…
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్దాపన సమయంలో సభా వేదికపై మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిలు ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రూ. 215 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. అయితే…
జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.
శ్రీశైలం ఆలయ ప్రాకారంపై శిల్పాలను డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి స్థల పురాణ గ్రంథాన్ని నిపుణులతో తయారు చేయిస్తామని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.