Minister Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 35 వేల కోట్లు అవినీతి ఎలా జరిగిందని పవన్ కళ్యాణ్‌ని మోడీ అడిగితే ఏం చెప్తారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ కళ్యాణ్.. ఇంటర్‌పోల్‌ను మర్చిపోయాడని అన్నారు.
Read Also: Minister Tummala: సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు.. కానీ..
దేశంలో ఎక్కడలేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీలో మీ నాయకులు నెగ్గుతారో లేదో ముందు అది చూడు, అది మానేసి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావ్ అంటూ వ్యాఖ్యానించారు. కాపులు నాకు ఓట్లు వేయలేదు అని అంటున్నావ్ మరి నీకు ఎవరు ఓట్లు వేశారంటూ పవన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో స్కిల్ స్కాం, అమరావతి భూముల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం అన్ని స్కాములే అంటూ విమర్శించారు. ఈ స్కామ్‌లలో పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.