CM Jagan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ స్థాయిలో బారులు తీరారు. మూలా నక్షత్రం ప్రత్యేక రోజు కావడంతో ఏపీ సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు,…
Kottu Satyanarayana: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఫైర్ సేఫ్టీ కోసం రూ.500, మైక్ పర్మిషన్ కోసం రోజుకు రూ.100 చలానా రూపంలో కట్టాలని.. ఈ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. కొత్తగా పెట్టిన నిబంధనలు కాదని స్పష్టం చేశారు. కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే గణేష్ మండపాల ఏర్పాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని.. గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని తెలిపారు. దేవుడితో చెలగాటం…