Kottu Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్ అని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. తన అవసరం బీజేపీకి ఉన్నట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు.. బీజేపీ పెద్దలు బతిమాలి బాబాను పిలిచినట్టు చెప్పుకొచ్చారు.. కానీ, బీజేపీని శాసించే పరిస్థితిలో చంద్రబాబు లేరని వ్యాఖ్యానించారు. ఇక, ఢిల్లీ వెళ్లి వచ్చాక చంద్రబాబు మొహం వాడిపోయిందన్నారు.. పవన్ కల్యాణ్ దిగజారిపోయారు అంటే కోపం తెచ్చుకునే జనసైకులు ఇప్పుడు ఏమంటారో వారి విజ్ఞతకే వదిలేయాలన్నారు. చంద్రబాబు మోసం చేస్తాడు అని జనసేన పార్టీలో అంతర్మథనం మొదలయ్యిందన్నారు.. అధికార పంపిణీ, 50కి పైగా సీట్లు జనసేనకు ఇస్తేనే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయని మాజీ మంత్రి హరిరామ జోగయ్య సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. ఇక, పవన్ కల్యాణ్ నమ్ముకుంటే మనకి మిగిలేది ఎంటి అని కాపులు ఆలోచిస్తున్నారన్నారు. కానీ, ఫైనాన్సియల్ బెనిఫిట్స్ కోసమే పవన్ చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు వైఎస్ జగన్‌ని ఓడించడం ఎవరివల్లకాదు అని బీజేపీ సైతం భావిస్తుందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: Yandamuri: చిరంజీవితో వివాదం.. మొదటిసారి నోరువిప్పిన యండమూరి