విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేట్ నుంచి దర్శనానికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా ఉందన్న ధైర్యం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
ఇక, పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని వెల్లడించారు.