Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ రెండు పార్టీల పొత్తులపై స్పందించిన ఆయన.. సమరానికి సిద్ధమో లేదో టీడీపీ, జనసేన నిర్ణయించాలన్నారు. అభ్యర్ధులను ప్రకటిస్తే ఎన్నికలకు సిద్ధం అయినట్లేనా..? ఉమ్మడి మీటింగ్ లో సభలపై రెండు పార్టీల నేతలు ఉండాలిగా..? వేరు వేరుగా సభలు పెట్టుకుంటూ కలిసి ఉన్నామంటే ఎలా? కింద కేడర్ లో వున్న అభద్రతా భావాన్ని ఎవరు తొలగిస్తారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, పవన్ కల్యాణ్.. తణుకు పర్యటనలో జనసేన నాయకుడికి సీటు ప్రకటించాడు… ఇవాళ్టి లిస్ట్ లో టీడీపీ నేతను ప్రకటించారు.. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ మాటకు ఎంత విలువుందో చంద్రబాబు మాటకు ఎంత విలువ ఉందో అర్ధమవుతుందన్నారు.
Read Also: TDP – JanaSena First List: టీడీపీ – జనసేన తొలి జాబితా.. సామాజిక సమీకరణాలు ఇలా
ఇక, చంద్రబాబు 2014లో మేం కలిసి పోటీచేయడం చారిత్రక అవసరం అన్నాడు.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలన్న చంద్రబాబు.. తర్వాత కాంగ్రెస్ తో కలిశాడు అని దుయ్యబట్టారు మంత్రి కొట్టు.. బీజేపీని.. కాంగ్రెస్ తో కలిపేసుకోవడం చారిత్రక అవసరమా? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. దేశంలోని పార్టీలన్నింటితో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నాడు అని విమర్శించారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ తనకు 24 సీట్లు సరిపోయాయనుకుంటున్నాడేమో.. చంద్రబాబు తనకు ఎక్కువే ఇచ్చారనుకుంటున్నాడేమో..? అంటూ దుయ్యబట్టారు మంత్రి కొట్టు సత్యనారాయణ.