తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది.
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్.. రెడ్‌మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచం మొత్తం ఈరోజు నిలిచిపోయింది. ముఖ్యంగా విమానాశ్రయాలు, బ్యాంకులు, మీడియా మరియు స్టాక్ మార్కెట్లపై ప్రభావం కనిపించింది.
భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్లతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. తన భార్యకు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచిన బిల్ గేట్స్.. ఆ వెంటనే .. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రావడం.. దానికి సంస్థలో ఓ మహిళా ఉద్యోగితో ఆయనకు ఉన్న అఫైర్ కారణం కావడం పెద్ద చర్చగా మారింది.. అయితే,, తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. తనతో సహా అందరికీ 2000తో పోలిస్తే 2021లో మైక్రోసాఫ్ట్ విభిన్నమైందని ఓ ఇంటర్వ్యూలో…