మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. తన భార్యకు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచిన బిల్ గేట్స్.. ఆ వెంటనే .. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రావడం.. దానికి సంస్థలో ఓ మహిళా ఉద్యోగితో ఆయనకు ఉన్న అఫైర్ కారణం కావడం పెద్ద చర్చగా మారింది.. అయితే,, తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. తనతో సహా అందరికీ 2000తో పోలిస్తే 2021లో మైక్రోసాఫ్ట్ విభిన్నమైందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.. ప్రతిరోజూ సంస్థలో సానుకూలంగా పని చేసేందుకు అనువైన వాతావరణం కల్పించామని ఆయన.. వైవిధ్యభరితమైన సంస్కృతిని మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇక, సంస్థ ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు సత్య నాదెళ్ల.. అదే సమయంలో.. వారి సమస్యలు లేవనెత్తేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు చేసే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగల సామర్థ్యం తమ సంస్థకు ఉందన్న ఆయన.. ఎవరు సమస్య లేవనెత్తినా.. ఆ సమస్య 20 ఏళ్ల నాటిదైనా.. దర్యాప్తు చేస్తామని.. సమస్యలను బయటపెట్టిన వ్యక్తికి సంతృప్తి కలిగించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.