Nara Lokesh Meet Satya Nadella: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన ఆయన.. తాజాగా ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు.. రెడ్‌మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఎఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేశారు. కృత్రిమ మేధ (ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్ లో లోతైన ఆసక్తి కలిగిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషిచేస్తున్నారు.
Read Also: Astrology: అక్టోబర్ 29, మంగళవారం దినఫలాలు
ఇక, లోకేష్ తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ… మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని చెప్పారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ $3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ -డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు. అయితే, విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా రూపుదిద్దుకున్న విషయం మీకు తెలుసు. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు వివరించారు మంత్రి నారా లోకేష్.. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నాం. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేం అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నాం అని వివరించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఏపీలో అత్యుత్తమ ఐటీ, ఇంజనీరింగ్ ప్రతిభావంతులను తయారుచేసే బలమైన విద్యావ్యవస్థను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సేవలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. ఏపీలో ఐటీ, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక. ఆగ్రిటెక్ కు ఎఐని అనుసంధానించడం వల్ల మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎపిలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్ లకు అనువుగా ఉంటాయి. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుందన్నారు.. ఇక, క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాం లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరుతున్నాం. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి మా రాష్ట్రానికి వచ్చి పరిశీలించండి. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశోధించండి. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవోను కోరారు.
Had an insightful meeting with @satyanadella, CEO of @Microsoft. Sought his valuable guidance and support in advancing IT, AI, and skill development in Andhra Pradesh. Looking forward to collaborative efforts to drive digital transformation and opportunities in the state.… pic.twitter.com/8fmHhIGtIN
— Lokesh Nara (@naralokesh) October 29, 2024