Satya Nadella: అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం..
- తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటాం- సత్య నాదెళ్ల
- మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరి సీఎం
- స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్‌పై చర్చ
- ఈరోజు సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భేటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు. నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
Read Also: Medak: మద్యం షాపులో దొంగతనానికి వచ్చిన దొంగ.. కిక్కులో ఏం చేశాడంటే..?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని.. ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్య నాదెళ్లకు తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల (MW) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ను టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపివేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, Gen AI, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు.
Read Also: Viral News: దొంగ భక్తుడు.. హనుమంతుడికి పూజలు చేసి, కిరీటాన్ని దొబ్బేశాడు..(వీడియో)
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!