Ktr Meets Satya Nadella: సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ బిజినెస్, బిర్యానీ ముచ్చట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ktr Meets Satya Nadella: భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్లతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వీరి సమావేశంలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి వంటి విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి చాలా మాట్లాడుకున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Delhi Mayor Polls: మేయర్ పీఠం కోసం కొట్లాట.. తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా
Also Read
రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల అభివృద్ధి, హైదరాబాద్‌లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు మంత్రి వివరించినట్లు తెలుస్తోంది. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతోనూ సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని సత్య నాదెళ్ల అన్నారు. డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి ప్రపంచానికి వెలుగుగా నిలిచేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. డిజిటలైజేషన్‌పై కేంద్రం దృష్టి సారించడంపై ప్రశంసలు కురిపించారు. టెక్ దిగ్గజం భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్‌ను సాకారం చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
— KTR (@KTRBRS) January 6, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!