Instagram Down: వరసగా పలు సోషల్ మీడియా యాప్ లు పనిచేయడం లేదు. ఇటీవల ట్విట్టర్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోగా.. తాజాగా మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. వినియోగదారులు ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కు ఖచ్చితమైన కారణాలు తెలియపోనిప్పటికీ వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కంటెంట్ పోస్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Twitter Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగాల కోతలు ఆ తరువాత మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కొనసాగించాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యాన్ని బూచిగా చూపుతూ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను ఫైర్ చేస్తున్నాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతేడాది తన సంస్థలో పనిచేస్తున్న 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపుగా 3000కు పైగా ఉద్యోగులను తొలగించింది.
MyGate Lays Off: ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ…
IT Layoffs: ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది.
Facebook, Instagram, WhatsApp Down For Thousands Of Users In US: అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్,…
Google Layoff: ఐటీ ఉద్యోగుల తొలగింపుల్లో రోజుకో ఉద్యోగి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థతో దశాబ్ధాల అనుబంధం ఉన్న ఉద్యోగి అయినా.. కొత్తగా జాబ్ లో చేరిన వారు అయినా ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. తాజాగా గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు…
IT Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థికమాంద్యం ముంగిట ఉంది. ఏకంగా మూడోవంతు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యబారిన పడుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని అంచానా వేసింది. గతేడాది కంటే 2023 చాలా కఠినంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రపంచం అంతా మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది.…
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని…
Cisco Joins Global Wave Of Tech Lay-Offs, Will Cut 4,000 Jobs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గిపోవడవంతో టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజ సంస్థ చేరింది. సిస్కో గత నెలలో 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని…
Amazon Plans To Sack 20,000 Employees: ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్ లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.