గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రసూతి సెలవులో ఉండగా.. ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మెటా ఉద్యోగి పేర్కొంది. కంపెనీలో మూడేళ్లు పని చేసిన సదరు ఉద్యోగి.. తొలగింపుల కారణంగా తన ప్రసూతి సెలవులు అని తెలిపారు.
Alosr Read:Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
టాలెంట్ అక్విజిషన్, రిక్రూటింగ్ టీమ్‌లో భాగమైన సారా ష్నీడర్ అనే యువతి.. కంపెనీలో మూడేళ్లు పని చేసింది. ఈ సమయంలో పెళ్లి, గర్భం దాల్చడం జరిగింది. మెటా లేఆఫ్‌ల కారణంగా మెటాలో నా ప్రసూతి సెలవు తగ్గించబడిందని తెలిపారు. తాను కంపెనీలో 3 సంవత్సరాలు పని చేశానని తెలిపింది. అత్యుత్తమ బృందాలు, నమ్మశక్యం కాని వ్యక్తులతో పనిచేశానని తెలిపింది. తన తొలగింపు పనితీరు ఆధారితమైనది కాదని చెప్పింది. పీపుల్ టీమ్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ టీమ్‌కు రిక్రూట్‌మెంట్‌లో సమయాన్ని వెచ్చించినందుకు తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. దీనికి ముందు, ఆమె ప్రసూతి సెలవు సమయంలో మరో మెటా ఉద్యోగిని కూడా తొలగించారు.
Alosr Read:TCS CEO: టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ రాజీనామా.. సంస్థలో అనూహ్య మార్పు
కాగా, దిగ్గజ టెక్ కంపెనీ మెటా 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నాలుగు, అయిదు నెలల క్రితం 11 వేల మందిని తొలగించింది. రెండో రౌండ్‌లో కూడా అదే స్థాయిలో జాబ్‌లు తొలగిస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగించారు.
అమెరికాలో ఆర్థిక పరిస్థితులు కారణంతో పలు కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా టెక్ పరిశ్రమలు సుమారు 2.80 లక్షల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ ఏడాది మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండు నెలల్లోనే అమెరికా కంపెనీలు 1.80 లక్షల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉద్యోగాల తొలగింపు 40 శాతానికి చేరే అవకాశం ఉందని లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్‌సైట్ తెలిపింది.