IT Layoffs: ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది. ఈ లేఆఫ్స్ లో అభిషేక్ ఆశిష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏడాది కాలంగా బైజూస్ లో పనిచేస్తున్న తనను తీసేసినట్లు వెల్లడించారు. ఐఐటి గ్రాడ్యుయేట్ అయిన అభిషేక్ ఆశిష్ జూన్ 2022 నుండి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ ఫ్రెషర్‌లందరినీ తొలగిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
Read Also: Afghanistan: టీవీ షోలో సర్టిఫికేట్లు చించేసిన ప్రొఫెసర్.. దాడి చేసి నిర్భంధించిన తాలిబాన్లు.
అనేక మందితో పాటు కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నా ఉద్యోగం కూడా బైజూస్ రెండో విడత లేఆఫ్స్ తో ప్రభావితం అయిందని.. వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారని.. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాశారు. ‘‘ ఏది జరిగిన అది మంచికోపమే జరుగుతుంది’’ అంటూ పోస్ట్ లో రాశారు. జీవితంలో నాకు ఏది రాసి ఉందో అని, కొత్త సవాళ్ల కోసం వెతుకుతున్నానంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఆశిష్ కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాని.. అవకాశాలు ఉంటే చెప్పాలని లింక్డ్‌ఇన్ లో కోరాడు. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నానని.. ఎవరైనా నియామకం చేస్తుంటే లేదా ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే నన్ను రిఫర్ చేయగలరని కోరాడు. లింక్డ్‌ఇన్ లో తన రెజ్యూమ్ కూడా పెడుతున్నానని పోస్ట్ లో వెల్లడించారు. బైజూస్ గతేడాది అక్టోబర్ నెలలో 2000 మందిని తొలగించింది. తాజాగా మరో 1000 మంది ఉద్యోగులను ఊడపీకింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్ దిగ్గజాలు అయిన మెటా, ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.