Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
Meta Layoff: ఐటీ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియడం లేదు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అయిన మెటా, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేల
Meta Layoffs: ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది.
Meta Record Fine : సోషల్ మీడియా దిగ్గజం షేక్‌బుక్ మాతృసంస్థ మెటాకు భారీ షాక్ తగిలింది… యూరప్ యూజర్ డేటాను యూఎస్‌కు బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ‘మెటా’కు రికార్డు స్థాయిలో జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్.. మెటాపై రికార్డు స్థాయిలో అంటే 1.3 బిలియన్ యూరోలు జరిమానా విధించింది.. అదే విధంగా అట్లాంటిక్ అంతటా వినియోగదారు డేటాను బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ మే 22న ఈ నిర్ణయం…
BT Group: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో యూకే టెలికాం దిగ్గజ సంస్థ బీటీ గ్రూప్ చేరింది. ఏకంగా 55,000 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు 2030 నాటికి వరకు జరుగుతాయని వెల్లడించింది.
Amazon Layoff: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
IT Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఆర్థికమాంద్యం భయాలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఐటీలో సంక్షోభానికి కారణం అవుతున్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను విసిరి అవతలపారేశాయి.
Morgan Stanley Layoff: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది.
Meta: ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయాలు తగ్గడంతో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ట్విట్టర్ ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే పలు కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలను తగ్గిస్తున్నాయి.