Instagram Down: ఇటీవల ట్విట్టర్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోగా.. తాజాగా మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. వినియోగదారులు ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కు ఖచ్చితమైన కారణాలు తెలియపోనిప్పటికీ వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కంటెంట్ పోస్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: IND vs AUS : రవిశాస్త్రివి అన్నీ ఒట్టి మాటలే.. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
డైన్ డిటెక్టర్ ప్రకారం.. అమెరికాలో 46,000 కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ చేయడంలో సమస్యలను నివేదించినట్లు తెలిపింది. యూకేలో 2,000 మంది వినియోగదారులు, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అనేక అకౌంట్లు అనూహ్యంగా సస్పెండ్ అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి ఇన్ స్టా డౌన్ అయినట్లు డౌన్ డిటెక్టర్ అవుటేజ్ గ్రాఫ్ లో పెరుగుదల కనిపించింది. దీనిని పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అంతరాయం 50 శాతం సర్వర్ కనెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు.. 20 శాతం మాత్రమే లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ అంతరాయంపై నెటిజెన్లు ట్విట్టర్ లో మీమ్స్ తో హడావుడి చేస్తున్నారు.