Twitter Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగాల కోతలు ఆ తరువాత మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కొనసాగించాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యాన్ని బూచిగా చూపుతూ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను ఫైర్ చేస్తున్నాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతేడాది తన సంస్థలో పనిచేస్తున్న 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపుగా 3000కు పైగా ఉద్యోగులను తొలగించింది.
Read Also: Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ..
ఇదిలా ఉంటే ట్విట్టర్ మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. తాజా తొలగింపుల్లో భాగంగా దాదాపుగా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది కంపెనీ వర్క్ ఫోర్స్ లో 10 శాతం తొలగింపులలో మెషిన్ లర్నింగ్ , ఫ్లాట్ ఫామ్ రిలియబిలిటీపై పనిచేస్తున్న ప్రోడక్ట్ మేనేజర్లను, డేటా నిపుణులను, ఇంజనీర్లను తొలగించింది. ముఖ్యంగా అమెరికాలోని ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. భారత ఐటీ నిపుణులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాయి. జనవరిలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది, 5 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ కూడా 18,000 మందిని తొలగించింది. మెటా గతేడాది చివర్లో 11,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇటీవల యాహూ కూడా 20 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.