Meta: ట్విట్టర్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వేదికగా నిలిచింది. ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా. ట్విట్టర్ ప్లేస్ ను ఆక్రమించేందుకు, దానికి పోటీగా నిలిచేందుకు కొత్త సోషల్ మీడియా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో మెటా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Zombie Virus: 48 వేళ్ల నాటి జాంబీ వైరస్‌ను మేల్కొలిపిన సైంటిస్టులు..
మెటా కొత్త యాప్ మాస్టోడాన్ వంటి డిసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి ఉండనుంది. ట్విట్టర్ లాంటి సేవలను అందించే మాస్టోడాన్ ను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి 2 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టెక్స్ట్ అప్డేట్స్ కోసం సోషల్ నెట్వర్క్ అణ్వేషిస్తున్నట్లు, క్రియేటర్స్, పబ్లిక్ ఫిగర్స్ తమ ఆసక్తులకు సంబంధించి సమయానుకూలంగా ఆప్డేట్స్ పంచుకునేందుకు ప్రత్యేకంగా యాప్ అవసరం ఉందని భావిస్తున్నట్లు మెటా స్పోక్స్ పర్సన్ రాయిటర్స్ కు వెల్లడించాడు.
అయితే మెటా కొత్త యాప్ ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టంగా తెలియలేదు. 2010 తొలినాళ్లలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కొనుగోలు చేసిన తర్వాత మెటా వినియోగదారుల పెరుగుదలను చూసింది. ఆ తరువాత చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంది. డిసెంబర్ 2022 త్రైమాసికంలో మెటా యాక్టివ్ యూజర్ల సంఖ్య 4.2 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది.