ఉక్రెయిన్ రష్యా మధ్య ఇప్పటికే గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో విజయం సాధించి ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తున్నది. అయితే, వీలైనంత వరకు రష్యా సేనలకు నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీసుకున్న యుద్ధ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం…
ఫేస్‌బుక్ ప్రారంభం నుంచి మెసెంజర్‌కు మంచి డిమాండ్ ఉన్నది. షార్ట్ మెసేజింగ్ కోసం దీనిని వినియోగించేవారు. అయితే, వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తరువాత మెసెంజర్ వాడకం తగ్గిపోయింది. అయితే, మెసెంజర్‌లో భారీ మార్పులు చేసి వినియోగదారులకు అందించేందుకు ఫేస్‌బుక్ సిద్దమయింది. ఇకపై మెసెంజర్ చాట్‌లో స్క్రీన్ షాట్ తీస్తే సదరు వినియోగదారుడిని అలర్ట్ చేస్తూ మెసేజ్ వెళ్తుంది. దంతో చాట్ చేసేవారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాట్‌పై పలు ఫిర్యాదులు అందుతున్న సమయంలో ఫేస్‌బుక్ ఈ…
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సప్ ద్వారా డబ్బులు చెల్లించే, బదలాయించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఇందులోనే మారో ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయింది. క్రిప్టో కరెన్సీపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీ పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్నిలో…
ఫేస్‌బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్‌బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు.…
ఫేస్‌బుక్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యక్తిగత గోప్యత తదితర విషయాలపై అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ కీలక ఫేస్ రికగ్నైషన్ ఆప్షన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫేస్ ప్రింటర్లను సైతం తొలగిస్తున్నట్టు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తెలియజేసింది. అపరిమిత వినియోగం నుంచి వినియోగాన్ని పరిమితం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా తెలియజేసింది. Read: దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు ఈ ఆప్షన్‌ను తొలగించడం వలన దీని ప్రభావం…
ఫేస్‌బుక్ పేరు మార్చుకున్నది. మెటా వర్స్ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది ఫేస్‌బుక్. మెటా వర్స్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. మెటా అనేది గ్రీక్ పదం. మెటా అంటే ఆవల అని, వర్స్ అంటే విశ్వం అని అర్ధం. అంటే విశ్వం ఆవల. భవిష్యత్తులో ఇదే కీలకం అవుతుందని ఫేస్‌బుక్ బలంగా నమ్ముతున్నది. ఊహా ప్రపంచానికి వాస్తవ అనుభూతికి కలిగించేలా మెటా వర్స్‌ను రూపొందిస్తున్నారు. ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ వర్చువల్‌గా…
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా..! ఈ మూడు సోషల్ మీడియా యాప్స్ మన జీవితంలో భాగమైపోయాయి. ఉదయం నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే కాలక్షేపం. అన్ని అప్డేట్స్ అందులోనే చూసి తెలుసుకుంటున్నాం..! ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ఐతే సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక… వివాదాలు మొదలయ్యాయి. ఫేక్న్యూస్పై జూకర్బర్గ్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాట్సాప్, ఇన్స్టాలకు కూడా ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీలా ఉంది. దాంతో వివాదాలతో ఫేస్‌బుక్ ప్రతిష్ట దిగజారుతుందని…