MyGate Lays Off: లేఆఫ్ జాబితాలోకి మరో కంపెనీ.. 30 శాతం ఉద్యోగులకు ఉద్వాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MyGate Lays Off: ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో ఉంది. అయితే తాజాగా ఇండియాకు చెందిన పలు కంపెనీలు కూడా నెమ్మదిగా ఉద్యోగులను తీసేసే పనిలో ఉన్నాయి.
Read Also: Medical Miracle: హెచ్ఐవీ ఆపై క్యాన్సర్.. అయినా కోలుకున్న రోగి.. ప్రపంచంలో మూడో వ్యక్తిగా రికార్డ్..
Also Read
తాజాగా ప్రముఖ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ‘మైగేట్’ తన మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం మందిని తొలగించింది. బెంగళూర్ కు చెందిన ఈ స్టార్టప్ మిడ్ మేనేజ్మెంట్, జూనియర్ రోల్స్ లో ఉన్నవారిని ఉద్వాసన పలికింది. ఈ సంస్థలో మొత్తం 600 మంది ఉద్యోగులు ఉంటే 400 మందికి తగ్గించింది. గత డిసెంబర్ లో కూడా మైగేట్ ఇదే విధంగా కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి రెండు నెలల జీతాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది.
2016లో విజయ్ అరిసెట్టి, వివైక్ భరద్వాజ్, శ్రేయాన్స్ దాగా, అభిషేక్ కుమార్ లు ‘మైగేట్’ను స్థాపించారు. అపార్మెంట్ల భద్రతాకు సంబంధించిన పలు సేవలను ఈ సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. పెట్టుబడులు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలోని చాలా స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. బైజూస్, కార్స్ 24, ఓఎల్ఎక్స్, ఎంపీఎల్, ఉడాన్, అన్ అకాడామీ, వేదాంతు, ఓయో, లీడ్, ఓలా వంటి భారతీయ స్టార్టప్స్ 2022 నుంచి ఇప్పటి వరకు 22,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
- Tags
- IT layoffs
- meta
- Microsoft
- mygate
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!