Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది.
Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.
Google: ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి.
Meta Verified Blue Tick: సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు వడ్డింపుల బాట పట్టాయి.. దీనికి ఆజ్యం పోసింది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి.. బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తోంది ఆ సంస్థ.. ఇక, అదే బాట పట్టాయి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ .. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను వాటి మాతృసంస్థ అయిన మెటా వెల్లడించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది మెటా.. మొబైల్…
Meta: ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగుల తొలగింపు వార్తలే.. ముఖ్యంగా టెక్ కంపెనీలు పోటీపడి మరీ ఉద్యోగులను తొలగిస్తున్నాయా? అనే రీతిలో ఉంది వ్యవహారం.. పేరు మోసిన టెక్ కంపెనీల నుంచి చిన్న కంపెనీల్లోనూ ఇదే తీరు ఉంది.. అయితే.. ఓ ఉద్యోగిని మాత్రం.. ఏ మాత్రం పనిచేయకుండానే దాదాపు కోటిన్నర రూపాయాలు జీతంగా అందుకుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.. తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నాను అంటూ.. ఫేస్‌బుక్…
Indeed Layoff: అమెరికాకు చెందిన ప్రముఖ జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ ఇండీడ్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. టెక్ లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుతం కాలంలో తాము కూడా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే కంపెనీ నుంచి 15 శాతం ఉద్యోగులను తొలగించనుంది. సీఈఓ క్రిస్ హైమ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండీడ్ లో మొత్తం 14,600 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా అన్ని విభాగాల నుంచి కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Meta Paid Verification: ట్విట్టర్ దారిలోనే మెటా కూడా బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించారు. మెటా శుక్రవారం అమెరికా వినియోగదారుల కోసం పెయిడ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది యూఎస్ వినియోగదారులకు పెయిడ్ ఆప్షన్ అందించాలని కంపెనీ యోచిస్తోంది.
గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు.
Meta: ట్విట్టర్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వేదికగా నిలిచింది. ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా. ట్విట్టర్ ప్లేస్ ను ఆక్రమించేందుకు, దానికి పోటీగా నిలిచేందుకు కొత్త సోషల్ మీడియా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో మెటా ఉన్నట్లు తెలుస్తోంది.