పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు…
పెళ్లిపేరుతో మోసం చేసిన ఓ ముఠాపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. బాధితుడినే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది నకిలీ పెళ్లికూతురు. ఫోన్ చేసి వేధించాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ పెళ్లి పేరుతో మోసం ఎలా జరిగిందంటే.
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు అన్నా-చెల్లెలు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. పెద్దలు నిరాకరించడంతో చెరువులో దూరి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కొన్ని నిమిషాల్లో పెళ్లి అయిపోతుందనే సమయానికి పెళ్లి వేదికకు ప్రియురాలి వచ్చి హల్ చల్ చేసింది. దీంతో.. పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో వివాహం జరగాల్సి ఉంది. అయితే.. వరుడు సయ్యద్ భాషాతో తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం ఉంది. కాగా.. తన ప్రియుడికి వేరే అమ్మాయితో వివాహం అవుతుందని తెలుసుకుని పెళ్లి వేదికకు వచ్చింది.
తిరుమలలో రోండోవ పెళ్లికి సిద్దపడిన భర్తను అడ్డుకుంది వరంగల్ కి చెందిన సంధ్య అనే మహిళ.. విడాకులు తీసుకోకూండానే రెండో పెళ్లి చేసుకుంటున్న భర్త రాకేష్ పై పోలీసులుకు పిర్యాదు చేసింది భార్య సంధ్య. దీంతో.. పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు పోలీసులు.. ఇక ఊహించని ఘటనతో షాక్ తిన్న భర్త రాకేష్.. అక్కడ నుంచి సైలెంట్‌గా జారుకుని పరారైయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Gujarat: గుజరాత్ అహ్మదాబాద్‌కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
ఉత్తర ప్రదేశ్లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. యువకుడు సిద్ధార్థ్ ప్రేమ పెళ్లి చేసుకోగా.. తనకు ఆడపిల్ల జన్మించిందని.. మరో పెళ్లి చేసుకోబోయాడు. ఒక రిసార్ట్ లో మరొక పెళ్లి రెడీ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధిత మహిళ కవిత.. ఎలాగైనా పెళ్లిని ఆపుతానని తెలిపింది. ఆడబిడ్డ పుట్టిందని వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. రూ. కోటి కట్నం కావాలని…