వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు అన్నా-చెల్లెలు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. పెద్దలు నిరాకరించడంతో చెరువులో దూరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయపర్తి మండల కేంద్రం.. శివారులోని రామచంద్రునికి చెరువులో పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చెరువు దగ్గర ఉండటంతో అటుగా వెళ్లిన పశువుల కాపరు చెరువులో మృతదేహాలను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హన్మకొండ జిల్లా ఎనమాముల మండలం మద్దేగుడెం గ్రామానికి చెందిన సంగాల దిలీప్,(29)తిక్క అంజలి(25) గా గుర్తించారు.
READ MORE: TFJA: జ్యోతిష్యుడు వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
యువతీ యువకులు ఒకే గ్రామానికి చెందిన వారిగా తేల్చారు. చెరువు కట్టపై బైక్ , బ్యాగ్ తో పాటు యువతీ యువకుల చెప్పులు కనిపించాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీరు వరుసకు అన్నా చెల్లెలుగా గుర్తించారు. ఇద్దరు ప్రేమించుకున్నట్లు అభిప్రాయపడ్డారు. పెద్దలు వీరి వివాహానికి అడ్డు చెప్పినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం వర్ధన్నపేట ఏసీపీ గుమ్మడి నరసయ్య, వర్ధన్నపేట సీఐ సూర్య ప్రకాష్, ఎస్సై ప్రవీణ్ కుమార్ తదితరులు పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు.