AP Crime: పసుపు పారాణి ఆరలేదు.. నవ వధువు దారుణ హత్య..! మృతదేహంతో ఆందోళన..
- పసుపు పారాణి ఆరకముందే.. నవ వధువు దారుణ హత్య..! నెల రోజులు కూడా నిండక ముందే భర్త హత్య చేశాడని ఆరోపణ..
- గొంతు నులిమి.. చెవిపై బలంగా కొట్టి చంపాడంటున్న కుటుంబ సభ్యులు..
- అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
పూర్తి విరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన కుడిపూడి రమ్య సత్యప్రియకు ఆగష్టు 18 వ తేదీన అమలాపురం రూరల్ మండలం వేమవరం- నామాల వారిపాలెంకు చెందిన కొప్పిశెట్టి వెంకటసాయితో వివాహం అయ్యింది. వెంకటసాయి హైదరాబాద్ పఠాన్‌చెరులో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి తొత్తరమూడిలో వస్త్ర దుకాణంలో పనిచేసేది. పెళ్లైన తరువాత తొలిసారి అప్పగింతల వరకూ ఇరువురి బంధువుల మధ్య అన్నీ సవ్యంగానే జరిగాయి. ఇక, అమ్మాయి తల్లిదండ్రులు గత నెల 30వ తేదీన చివరి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతానికి పంపమని అబ్బాయిని కోరడంతో లేనిపోని సాకు చెప్పి రాత్రికి రాత్రే హైదరాబాద్ తీసుకువెళ్లిపోయాడని సోదరుడు రమేష్ తెలిపాడు. అక్కడికి వెళ్లినా సోదరి ఫోన్ చేసే వరకూ హైదరాబాద్ తీసుకెళ్ళిన సంగతి నాకు తెలియదని చెప్పాడు. అనంతరం వారం రోజులు ఫోన్లో మాట్లాడేదని అ దికూడా అమ్మాయికి ఫోన్ ఇవ్వకుండా వాళ్ల ఫోన్ నుంచే మాట్లాడించే వారన్నారు. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ.. గత మూడు రోజుల నుంచీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని.. తిరిగి నాకు ఫోన్ చేసి ఏమి తెలియనట్లు మీ చెల్లికి ఏమైనా అనారోగ్యం ఉందా అని అడిగారని సోదరుడు రమేష్ చెప్పాడు.. ఇక, ఈ నెల 10 వ తేదీన ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని చెప్పారని కన్నీటి పర్యంతమయ్యాడు. కావాలనే నా చెల్లిని భర్త వెంకట సాయి, ఆడపడుచు కలిపి చంపేసారని రమేష్ ఆరోపిస్తున్నాడు. మృతదేహంతో అమలాపురం మండలం తొత్తరమూడిలోని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నా చెల్లెలు మృతి పట్ల పలు అనుమానాలున్నాయని.. మాకు న్యాయం చేయాలని మృతురాలి సోదరుడు రమేష్ కోరుతున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?