Marriage: పెళ్లిలో అత్తమామలను చెప్పుతో కొట్టిన వరుడు.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..?
- పెళ్లిలో అత్తమామలను చెప్పుతో కొట్టిన వరుడు
- ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఘటన
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వధువు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Read Also: ఎక్స్‌లో 100 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ సెలబ్రిటీలు వీరే!
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో వరుడు దిలీప్ (25)తో వధువు అంజలి (18) వివాహం జరుగుతుంది. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లి మండపంపై ఉన్న వధువు తల్లిదండ్రులను వరుడు దిలీప్ ఒక్కసారిగా చెప్పుతో కొట్టాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు షాక్ కు గురయ్యారు. కాగా.. తన తల్లిదండ్రులపై ఇలాంటి ఘటనకు పాల్పడిన దిలీప్ పై వధువు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Kiran Abbavaram: నీకు పాన్ ఇండియా సినిమా ఎందుకున్న రిపోర్టర్.. కిరణ్ అబ్బవరం షాకింగ్ సమాధానం
దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు దిలీప్, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వధువు తరుఫు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బంధువుల జోక్యంతో ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ఆలయంలో ఇరువర్గాల సమక్షంలో వధూవరులకు వివాహం జరిపించారు. కాగా.. ఈ ఘటనపై ఇరువర్గాలు అంగీకారంతో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని, పెళ్లి పూర్తి అయిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!