యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా తల్లి కావడం లేదని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలో మహిళ ఉరివేసుకుని చనిపోయిందని తేలింది. ఆమెను హత్య చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు.. ఊరి బయట మహిళ రక్తంతో తడిసిన బట్టలు లభించడం చర్చనీయాంశమైంది.
Read Also: Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి చౌబియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌పూర్ గ్రామంలో సోమన్ (30) మృతదేహం ఇంటి లోపల మంచంపై పడి ఉంది. ఈ విషయాన్ని మృతురాలి భర్త అత్తమామలకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న మహిళ తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఇంట్లో సోనమ్ అత్త మాత్రమే ఉంది. మహిళ తల్లిదండ్రులు వచ్చేలోపు భర్త ఇంటి నుండి పరారయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం పరిశీలించారు. అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు అత్తను విచారించగా.. సోనమ్‌ను కొట్టామని, దాని వల్లే ఆమె చనిపోయిందని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని.. తల్లి కావడంలేదని మనస్తాపంతో సూసైడ్ చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు.
Read Also: Janasena: షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!
మృతురాలు సోనమ్‌కి పెళ్లయి ఏడేళ్లు అయింది. అప్పటి నుంచి ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి కావడం కోసమని ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి తనకు వచ్చిన అవమానాలతో మహిళ ఇబ్బంది పడేది. ఈ క్రమంలోనే.. అత్తమామలు తనను చిత్రహింసలకు గురిచేశారని మృతురాలి సోదరుడు ఆరోపించాడు. తన సోదరిని అత్తమామలు కొట్టి చంపారని, అనంతరం రక్తంతో తడిసిన బట్టలను గోనె సంచిలో వేసి చెరువు ఒడ్డున పడవేశారని తెలిపాడు.