ఈ మధ్య సినిమాటిక్ సన్నివేశాలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. అఫ్‌కోర్స్ నిజ జీవితంలోవే సినిమాలో పెడతారనుకోండి. పెళ్లి విషయంలో మాత్రం చివర్లో వచ్చే సీన్ మధ్య రిపీట్‌ల మీద రిపీట్‌లు కొడుతుంది. పెళ్లిపీటల మీద పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూర్చుంటారు. ఆఖరి నిమిషంలో ఆపండి అనే పిలుపు వినిపిస్తుంది. కట్ చేస్తే ప్రియుడు/ప్రియురాలి ఎంట్రీ ఇస్తాడు. ఇలాంటివి ఇప్పుడు బాగా కామన్ అయిపోయాయి. సరిగ్గా ఇలాంటి ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు (మం) అరవపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నిమిషాల్లో పెళ్లి అయిపోతుందనే సమయానికి పెళ్లి వేదికకు ప్రియురాలి వచ్చి హల్ చల్ చేసింది. దీంతో.. పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో వివాహం జరగాల్సి ఉంది. అయితే.. వరుడు సయ్యద్ భాషాతో తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం ఉంది. కాగా.. తన ప్రియుడికి వేరే అమ్మాయితో వివాహం అవుతుందని తెలుసుకుని పెళ్లి వేదికకు వచ్చింది. ప్రియుడు తనను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడడంతో జయ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Girls Missing Case: ధవళేశ్వరంలో అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు..
ఈ క్రమంలో.. షాదిఖానాలో పెళ్లి కొడుకు సయ్యద్ భాషాపై కత్తి, యాసిడ్ తో దాడి చేసింది. దీంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో అక్కడే ఉన్న కొందరి మహిళలపై యాసిడ్ పడింది. ఈ క్రమంలో ఒక మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. మరో మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. పెళ్లి కొడుకు సయ్యద్ భాషా, ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో వధువు బందువులు ఆవేదన చెందుతున్నారు.