చెన్నై పెళ్లి వేడుకలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ రోప్ తెగిపోయి కిందపడ్డ ఘటనలో ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లిలో భోజనం వడ్డించడానికి నలుగురు యువకులు లిఫ్ట్‌లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు విఘ్నేష్‌గా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విఘ్నేష్ ఇంటర్ చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు… కానీ, ఆ పార్ట్ టైం జాబే…
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే..…
విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో మెడలో తాళి పడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో పెళ్లి పీటలపైనే ఓ వధువు ప్రాణాలు కోల్పోయింది. నగరం పాలెంలో బుధవారం రాత్రి 7 గంటలకు నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలైంది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. Vangalapudi Anitha: అత్యాచారాలకు కామానేనా? ఫుల్‌స్టాప్ పడేది ఎప్పుడు? సృజన…
ఒక్కగానొక్కడ కొడుకు.. ఘనంగా పెళ్ళి నిర్వహించాలని బంధుమిత్రులందరినీ తల్లిదండ్రులు ఆహ్వానించారు.. అందరూ విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది.. రాత్రంతా అందరూ సంతోషంగా గడిపారు.. ఉదయమే లేచి ఇతర పనులన్నీ సిద్ధం చేసుకోవాలని అనుకొని పడుకున్నారు.. తీరా ఉదయం లేచి చూస్తే.. పెళ్ళి కొడుకు చేసిన పనికి విషాదఛాయలు అలుముకున్నాయి. వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత, తన గదిలోకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని మల్కాపురం జయేంద్రకాలనీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..…
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్త సమయానికి కరెంట్ పోవడంతో, పీటలపై ఉన్న వరుడు మారిపోయాడు. పెళ్ళి కూడా జరిగిపోయింది. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే.. అసలు విషయం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిన్‌కి చెందిన రమేశ్‌కు నిఖిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ ఒకేసారి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్న రమేశ్.. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తన కూతుళ్ళ పెళ్ళిని నిశ్చయించాడు. ఎట్టకేలకు పెళ్ళి…
ఓ వ్యక్తి 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం సాగిస్తున్నాడు.. వారికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.. ఆయన వయస్సు 42 ఏళ్లు.. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో గిరిజన ఆచారాల ప్రకారం 42 ఏళ్ల వ్యక్తి మౌర్య.. సహజీవనం చేసిన ముగ్గురు మహిళలను ఒకేసారి వివాహం చేసుకున్నాడు.. ముగ్గురు మహిళలతో అతనికి ఉన్న ఆరుగురు పిల్లలు కూడా వివాహ ఆచారాలలో పాల్గొన్నారు.…
కన్నడ సీరియల్ నటి రష్మీ ప్రభాకరన్ ఎట్టకేలకు తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అమ్మడు నిఖిల్ భార్గవ్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 25న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇక ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రష్మీ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కాబోయే భర్త పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడు పై వధువు చాకుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. వరుడు రామునాయుడు పై తానే దాడి చేసినట్లు ఒప్పుకుంది వధువు పుష్ప. భక్తి మైకంలో ఉన్న పుష్ప ..తనకు పెళ్ళి వద్దంటు తను దేవుని భక్తురాలిగా ఉంటానంటూ పలు మార్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఇప్పటికి రెండు పెళ్లి చూపులు కాన్సిల్ కావడంతో మూడవది ఒప్పించారు తల్లిదండ్రులు.…
ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసిన అలియా- రణబీర్ ;ఆ పెళ్లి గురించే ముచ్చట. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇక దీంతో బాలీవుడ్ ప్రముఖులు వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. అలియా- రణబీర్ లకు వీడియో ఆల్ లో విషెస్ చెప్పిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ జంటకు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఆశీర్వాదం అందించారు. సంజయ్…
కరోనా మహమ్మారి తర్వాత పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి. అయితే ఈ పెళ్ళి వేడుకల్లో విచిత్రమయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉల్లిధరలు పెరిగినప్పుడు ఉల్లి దండలు బహుమతులుగా ఇచ్చేవారు. కొత్తగా పెళ్లయినవారికి ఉల్లిపాయలు పెట్టి గిఫ్ట్ బాక్సులు అందించేవారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. ధరలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజుకి ఇంచుమించుగా రూపాయి పెంచుతూ చమురు సంస్థలు వినియోగదారులను ఎడాపెడా బాధేస్తున్నాయి. https://ntvtelugu.com/viman-restaurant-viral-in-vijayawada/ ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్…