ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే.. కోడళ్లను రాకిరంపాన పెడతారనే అపవాదు ఉంది.. కానీ, ఇక్కడ.. తమ కొడుకు మృతిచెందిన చేదు వార్తను దిగమింగి.. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు.
Read Also: Chandrababu: ముగిసిన కుప్పం టూర్.. ఇక, 3 నెలలకోసారి పర్యటన..
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ప్రకాష్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి.. 2021 ఏప్రిల్ 25వ తేదీన కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. భోపాల్ నెట్‌లింక్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే ఆయన మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడికి 2011 నవంబర్ 27వ తేదీన పెళ్లి జరిగింది.. ప్రస్తుతం వారికి అన్య తివారీ (9) కూతురు కూడా ఉంది. ప్రియాంక్ మృతితో అతని భార్య వితంతువుగా మారిపోయింది. అయితే, కోడలు, తొమ్మిదేళ్ల మనవరాలి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఓ నిర్ణయానికి వచ్చారు.. ఆమెను తమ కూతురిలా భావించి.. మరో వ్యక్తితో పెళ్లి చేసి.. కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వితంతువు అయిన కోడలు రిచా తివారీని అక్షయ తృతీయ నాడు నాగ్‌పూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి వివాహం జరిపించారు. అంతేకాదు.. తన సొంత ఖర్చుతో వైభవంగా కోడలికి పెళ్లి చేశారు.. తమ కుమారుడు కొనుగోలు చేసిన ఇంటిని కూడా కోడలికి రాసిచ్చి పెద్ద మనస్సు చాటుకున్నారు.. ఆ బంగ్లా విలువగా రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి తర్వాత అన్య కూడా తన తల్లితో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. ప్రియాంక్ మరణానంతరం అతని భార్య రిచాకు కంపెనీ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి.. ప్రియాంకకు తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకున్న ఆమె అత్తామామలపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.