ఓ వ్యక్తి 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం సాగిస్తున్నాడు.. వారికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.. ఆయన వయస్సు 42 ఏళ్లు.. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో గిరిజన ఆచారాల ప్రకారం 42 ఏళ్ల వ్యక్తి మౌర్య.. సహజీవనం చేసిన ముగ్గురు మహిళలను ఒకేసారి వివాహం చేసుకున్నాడు.. ముగ్గురు మహిళలతో అతనికి ఉన్న ఆరుగురు పిల్లలు కూడా వివాహ ఆచారాలలో పాల్గొన్నారు.
Read Also: KA Paul: మళ్లీ సిరిసిల్ల వస్తున్నా… దమ్ముంటే ఆపండి..!
భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్‌పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మౌర్య 2003లో తన మొదటి భాగస్వామితో నిశ్చితార్థం చేసుకున్నాడట.. ఆ తర్వాత కొంత కాలానికి మిగతా ఇద్దరు భాగస్వాములు కూడా అతనితో కలిసి జీవిస్తున్నారు. మొత్తంగా 15 ఏళ్ల తర్వాత మౌర్య ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా మరియు సక్రిని వివాహం చేసుకున్నాడు.. ఈ కార్యక్రమం గిరిజన ఆచారాల ప్రకారం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.. గిరిజన డోలు వాయించడంతో పాటు ‘ధోల్’ మరియు ‘మండల్’.. ఇలా స్థానికులు వారి వివాహ వేడుకను ఆనందంగా, ఉత్సాహంగా నిర్వహించారు.. మోరీ ఫాలియా గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ చేస్తోంది. పెళ్లి కార్డు, వరుడు మరియు వధువులు, వివాహ వేడుకలకు సంబంధించిన చిత్రాలను షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.