Manipur Violence: జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా మైయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కేంద్ర హోంమంత్రి మణిపూర్ లో పర్యటించినా.. శాంతి ప్రక్రియ కోసం కమిటీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అదుపులోకి రావడంతో లేదు. ఇదిలా ఉంటే గురువారం కూడా మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని ఇంఫాల్ లో నిరసనకారులు, భద్రత బలగాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణల్లో పలు ఇళ్లకు నిప్పంటించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతాబలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి.
Read Alos: Indonesia Open: చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు యింగ్ చేతిలో పీవీ సింధు పరాజయం
మణిపూర్ ఖమెన్ లోక్ గ్రామంలో నిన్న జరిగిన ఘర్షణల్లో మహిళతో సహా 9 మంది మరణించిన తర్వాత, ఈ రోజు ఇంఫాల్ లో ఘర్షణలు తెలెత్తాయి. బుధవారం ఇంఫాల్ లోని మణిపూర్ క్యాబినెట్ లోని ఏకైక మహిళా మంత్రి అధికారిక నివాసానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలు జరిగినప్పుడు మంత్రి నెమ్చా కిప్ జెన్ ఇంట్లో లేరు. మే 3 నుంచి మైయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు తెలెత్తాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 100కు పైగా మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.
మణిపూర్ రాష్ట్రంలో మెజారిటీ మైయిటీ కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని వ్యతిరేకిస్తూ..మిగతా వర్గాల ప్రజలు ‘గిరిజన సంఘీభావ’ ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. అప్పుడు ప్రారంభమైన హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ హింసను కొందరు తీవ్రవాదులు మరింతగా ప్రేరేపిస్తున్నారు. ముఖ్యంగా మయన్మార్ నుంచి మణిపూర్ లోకి ప్రవేశించి హింసను ప్రేరేపిస్తున్నారు.