Manipur violence: మణిపూర్ రాష్ర్టంలో చెలరేగిన జాతి హింస నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. జాతి హింసలో నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోనుంది. మొదటి ప్రాధాన్యతను నిర్వాసితులను ఆదుకోవడమేనని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా జాతి హింసలో నిరాశ్రయులైన నిర్వాసితులకు 15 రోజుల్లో తాత్కాలిక గృహాలను నిర్మించి ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా తాత్కాలికంగా నిర్మించే ఇళ్లను నిరాశ్రయులైన నిర్వాసితులకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రకటించారు.
Read also:Lavanya Tripati : పెళ్లి చేసుకోవడానికి కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాఠి..?
గత నెల నుండి మణిపూర్‌లో చెలరేగుతున్న జాతి హింసలో నిర్వాసితులైన వారి కోసం 15 రోజుల్లో తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేసి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు దయచేసి శాంతికి అవకాశం ఇవ్వండని సీఎం విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ప్రాంతాలలో తమ ఇళ్ల నుండి నిర్వాసితులైన వేలాది మంది ప్రస్తుతం ప్రభుత్వ శిబిరాల్లో ఉన్నందున వారిని ఆదుకోనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాజకీయంగా అత్యాశతో కూడిన అంశాలే రాష్ట్రంలోని ఈ పరిస్థితికి కారణమయ్యాయని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా క్షేత్రస్థాయిలో పనులు చేయడం ప్రారంభించాయన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో చీలికవర్గంగా ఉన్న సాయుధ తీవ్రవాదులు ఉన్నారని సీఎం బీరెన్ సింగ్ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు.
Read also: GVL Narasimha Rao: జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ చర్చకు సిద్ధమా అంటూ సవాల్
మంత్రివర్గ సహచరులతో కలిసి.. తమ ప్రభుత్వం పౌరులకు రక్షణ కల్పిస్తుందని సీఎం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తీవ్రవాద కార్యకలాపాల నుండి పౌరులను ప్రభుత్వం కాపాడుతుందని.. ప్రజలు శాంతించాలని, సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అన్ని వర్గాల నుండి సహకారం కోరుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మే 3న మణిపూర్‌లో హింస ప్రారంభమైనప్పటి నుండి మహిళలు మరియు పిల్లలతో సహా దాదాపు 50,650 మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో చేరాలని, లేకుంటే జీతాలు నిలిపివేస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ హెచ్చరించారు. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా ఇ-ఆఫీస్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతుండటంతో.. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నిరంతరం శ్రమిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రాదేశికతను, సమగ్రతను కాపాడేందుకు ప్రధాని ఇప్పటికే హామీ ఇచ్చారని చెప్పారు. చరిత్రలో తొలిసారిగా, కేంద్ర హోం మంత్రి రాష్ట్రంలో నాలుగు రోజులు ఉండి, రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దే పని చేశారని గుర్తు చేశారు.